Monday, June 17, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెల్లడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. విచారణ సందర్భంగా రాధాకిషన్ రావు వాంగ్మూలంలో అనేక విషయాలు వెల్లడించారు. బిఆర్ఎస్ కు ఇబ్బందిగా తయారైన వ్యక్తులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ ఎంఎల్ఏతో విభేదాలున్న శంబీపూర్ రాజు పై నిఘా పెట్టినట్లు తెలిపారు. జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, వంశీ కృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడించారు.

బిఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని ప్రణీత్ రావు టార్గెట్ చేసినట్లు విచారణలో వెల్లడయింది. కాంగ్రెస్, బిజెపి నేతలకు డబ్బు సాయం చేసిన వారిపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. కడియం శ్రీహరి, రాజయ్య విభేదాలపై నిఘా పెట్టామన్నారు.

రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణా రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈటల రాజేందర్, అర్వింద్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు కూడా రాధాకిషన్ రావు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News