Wednesday, July 24, 2024

కిషన్‌రెడ్డికి కొత్త బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలను బిజెపి అధిష్టానం అప్పగించింది. త్వరలో జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖంఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాలకు ఎన్నికల బాధ్యతలను పలువురికి బిజెపి అగ్రనాయకత్వం అప్పగించింది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జమ్మూకశ్మీర్ ఎన్నికల బాధ్యతలు అప్పగించగా మిగిలిన మూడు రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్‌చార్జిలను నియమించింది. హరియాణాకు ఎన్నికల ఇన్‌చార్జిగా ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, మహారాష్ట్ర బాధ్యతలను భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్‌కు అప్పగించారు. శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వశర్మలను ఝార్ఖండ్ ఇన్‌చార్జులుగా నియమిస్తున్నట్లు బిజెపి జాతీయ నాయకత్వం సోమవారం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News