Tuesday, June 18, 2024

బిజెపి పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

ఈ నెల ప్రారంభంలో బిజెపి తృణమూల్ కాంగ్రెస్‌ను అవినీతిపరులుగా , హిందువులకు వ్యతిరేకమైనదిగా చిత్రీకరిస్తూ కనీసం 4 దినపత్రికలలో ప్రకటనలు ప్రచురించింది.

లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన కలకత్తా హైకోర్టు ఆదేశాలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి న్యాయమూర్తులు జెకె. మహేశ్వరి, కెవి. విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ నిరాకరించింది. “ప్రాథమిక సాక్ష్యాధారాల (ప్రైమా ఫేసీ)  దృష్ట్యా ప్రకటన అవమానకరమైనది” అని బెంచ్ పేర్కొంది.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాజకీయ పార్టీలు, నాయకులు , అభ్యర్థులు ధృవీకరించని ఆరోపణల ఆధారంగా తమ ప్రత్యర్థులను విమర్శించడాన్ని నిషేధిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News