Sunday, May 19, 2024

బాచుపల్లి ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాచుపల్లి ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను సిఎం  వివరాలను అడిగి తెలుసుకున్నారు. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు తెలిపారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడుగురు మంది మృతి చెందగా మరో నలుగురికి గాయాపడినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారు ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, 4 పురుషులు ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News