Tuesday, April 30, 2024

అభివృద్ధి కోసమే నా ఆరాటం.. ప్రజల కోసమే పోరాటం

- Advertisement -
- Advertisement -

ఈ సారి ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా, కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ప్రజలకు ఇంకా చేయాలన్న భావనతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటా పోతా. నేను ఎవరికి పోటీ కాదు… నాకు ఎవరూ పోటీ ఉండరు… నాకు వ్యక్తిగత స్వార్థాలు లేవు, కేవలం పార్టీ లైన్‌లోనే పనిచేసుకుంటా పోతా. సంబంధం లేకుండా ప్రజలందరికీ సేవ చేశాను. మళ్లీ అదే బాటలో నడుస్తా. పిలిస్తే పలికే నాయకుడినే ఎంపిగా అపాయింట్‌మెంట్ ఉంటేనే కలుస్తా అనే నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల ఎంపి అభ్యర్థి గడ్డం పిలుపునిచ్చారు. ఆయన ‘మన ఇచ్చిన పలు విషయాలను పంచుకున్నారు. ఐదు సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధి, ఈ సారి ఎన్నికల్లో గెలిపిస్తే మరో ఐదేళ్లు ప్రజ లకు సేవ చేసుకుంటానని ఆయన పేర్కొంటున్నారు. బిఆర్‌ఎస్ నుంచి కాం గ్రెస్‌లోకి రావడానికి కారణాలు, ఈ ఐదేళ్లలో ప్రజల కోసం తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ఆయన మాటల్లోనే…. ‘మనతెలంగాణ’ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి రంజిత్‌రెడ్డి

నెలల కాంగ్రెస్ పాలనే గెలుపునకు పునాది సంబంధం లేకుండా ప్రజా సేవ చేస్తా పలికే నాయకుడినే ఎంపిగా గెలిపించండి ఎవరికీ పోటీ కాదు… నాకు ఎవరూ పోటీ ఉండరు…

గత ఐదేళ్లలో ఎలాంటి వ్యక్తిగత చేసుకోలేదు
గత ఐదేళ్లలోనూ తాను ఎలాంటి వ్యక్తిగత ఫైరవీలు చేసుకోలేదు. తనపై ఆరోపణలు చేసిన వారు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమే. తాను పార్టీలో చేరినప్పుడు సిఎం రేవంత్‌కు కూడా ఇదే విషయాన్ని తెలిపా. నా వ్యక్తిగత పనుల కోసం వస్తే పనిచేయొద్దని ముఖ్యమంత్రితో నిర్మొహమాటంగానే తెలియజేశా. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, సిఎం రేవంత్ నుంచి పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది. పోటీ చేయనని సిఎం రేవంత్ రెడ్డికి తెలియజేశా. కానీ, ఈ విషయంపై నాతోటి మిత్రులతో చర్చించినప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎంపిగా గెలిస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని నా మిత్రుల సలహా మేరకు కాంగ్రెస్‌లో చేరా. గత ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని, తాను పడ్డ కష్టాన్ని ప్రజలు గుర్తించారు. ఈసారి కూడా నాకే పట్టం కడతారన్న నమ్మకం నాలో ఉంది.

నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడాను…
ఎంపిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడాను. రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులను రాష్ట్రానికి తీసుకురావడంలో నిరంతరం కృషి చేశా. గత ఐదేళ్లలో మున్సిపాలిటీల నుంచి స్థానికంగా ప్రాజెక్టులు మంజూరు చేయించా. జిఓ 111ను రద్దు చేయడం మరో విజయం. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్ రహదారి కోసం పోరాటం చేశా. ఆ రోడ్డు పనులను మంజూరు, టెండర్లు ఫైనల్ చేశాం. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో శంకుస్థాపన చేయించాం. చాలా వరకు జాతీయ రహదారి పనులు మంజూరయ్యాయి. వికారాబాద్‌లోని అండర్ ప్రాసింగ్ రైల్వే ట్రాక్ పూర్తి చేశాం. ఎంపిగా ఉన్నప్పుడు నా సొంత నిధులతో చేవెళ్ల బస్టాండ్‌ను పునరుద్ధరించాం. దీంతోపాటు స్టేడియంను నిర్మించాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరీక్షల కోసం ఉచిత డయాగ్నస్టిక్‌ను అంబులెన్స్‌లను ఏర్పాటు చేశాం. రంగారెడ్డి జిల్లాలోని మండలాలను మహబూబ్‌నగర్‌ను మార్చడం వల్ల యువతకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. ఈసారి గెలిస్తే నా మొదటి పని వారి మండలాన్ని తిరిగి రంగారెడ్డి జిల్లాకు మార్చడం.

నాలుగు నెలలుగా ప్రభుత్వం పనిచేస్తోంది
ప్రస్తుతం పథకాలకు సంబంధించిన ఆర్థిక వనరులను ఎలా నిర్వహించాలో సిఎం రేవంత్ రెడ్డికి చాలా స్పష్టత ఉంది. నాలుగు నెలలు గడుస్తున్నా అధికారుల నియామకం, ఉద్యోగాల భర్తీ, పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేసింది. దేశంతో పాటు రాష్ట్రంలోనూ విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే సంక్షేమ పథకాలు అవసరం లేదు. అధికార పార్టీ నేతలతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందని ప్రజల్లో విశ్వాసం ఉంది. ఇలాంటి పరిస్థితిల్లో బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉందని నా సన్నిహితులు, మేధావులు తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా. గత ఐదేళ్లలో ప్రజలకు సాధ్యమైనంత వరకు అభివృద్ధి అందించా.

నాకు వ్యక్తిగత స్వార్థాలు లేవు
గ్రూపులు లేకుండా ఏ పార్టీ లేదు. బిఆర్‌ఎస్, బిజెపిలో కూడా గ్రూపు రాజకీయాలున్నాయి. కానీ, నేను గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటూ వెళ్తా. నాకు వ్యక్తిగత స్వార్థాలు లేవు. కేవలం పార్టీ లైన్‌లోనే పనిచేసుకుంటూ పోతా. నేనెప్పుడూ మనుషుల మధ్య విబేధాలు సృష్టించలేదు. బిఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాలున్నప్పటికీ పార్టీ చెప్పిన పద్ధతిలోనే పనిచేసుకున్నా. ప్రతిపక్ష అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపిగా ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు. తాను ఎంపిగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చామో ప్రజలకు తెలుసు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నేతృత్వంలోనే ఆయన, నేను పనిచేశాం. నా కంటే ఆయనకే కెసిఆర్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. మా ఇద్దరిలో ఎవరు ఏం చేశారో ప్రజల్లోకి వెళ్లి అడిగితే తెలుస్తుంది.

ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కే
చేవెళ్లలో 15 శాతం ముస్లింలు, 15 శాతం మాదిగలు, 13 నుంచి 14 శాతం ముదిరాజ్‌లు ఉన్నారు. ముస్లింల విషయానికి వస్తే బిజెపికి కాకుండా కాంగ్రెస్‌కు ఓటేస్తారన్న నమ్మకం ఉంది. ముస్లింలకు భద్రత చాలా ముఖ్యమైనది అందుకే వారు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు. మాదిగలు, ముదిరాజ్‌ల ఓట్లు మూడు పార్టీల మధ్య చీలిపోతాయి. ఓటర్ల మానసిక స్థితి, కాంగ్రెస్‌కు ప్రజల మద్ధతు, ఆరు హామీల అమలుతో సహా అనేక అంశాలు నా గెలుపునకు సహాయపడతాయి.

ఆరోపణలు కాదు… నిరూపించండి
కోళ్ల దాణా, అంగన్‌వాడీలకు పంపిణీ చేసే గుడ్లలో స్కాం జరిగిందని ప్రతిపక్ష పార్టీ నేత ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలతో నిరూపించకుండా ఆరోపణలు చేయడం తగదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కకు పెట్టి గడిచిన పదేళ్లలో ప్రజలకు ఎవరూ ఏం చేశారో వివరిద్దాం. ఐదేళ్లు ఈ నియోజకవర్గంలో ఎంపిగా పనిచేసిన తనను ఇప్పుడు కూడా లోకల్ కాదని ప్రత్యర్థులు ఆరోపణలు చేయడం వారికే చెల్లింది. 20 ఏళ్లుగా తనకు ఈ నియోజకవర్గంతో సంబంధాలు ఉన్నాయి. తన చదువుతో పాటు వ్యాపార సంబంధాలను ఈ నియోజకవర్గంతో కలిగి ఉన్నాను.

పాలమూరు ఎత్తిపోతలతో నియోజకవర్గం సస్యశ్యామలం
చేవెళ్ల- ప్రాణహిత, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులతో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో చేవెళ్ల పార్లమెంటు ప్రాంతానికి సాగు జలాలు అందించే కార్యక్రమం నడుస్తోంది. అయితే ఇవన్నీ టెక్నికల్ విషయాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది.

లోడె వెంకటేశం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News