Wednesday, May 22, 2024

ఆశీర్వదిస్తే… హ్యాట్రిక్ కొడతా

- Advertisement -
- Advertisement -
జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పడిన నుంచి రెండుసార్లు బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన బీబీ పాటిల్ మూడవసారి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి హాట్రిక్ కొట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్‌లోని ప్రజలు తన ఇంటికి వస్తే కడుపునిండా భోజనం పెట్టి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేస్తూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న బీబీ పాటిల్‌తో ‘మన తెలంగాణ’ మాటామంతి….

 

బిజెపిలోకి చేరగానే మీకు ఎంపి టికెట్ ఇవ్వడంతో ఎలాఫీల్ అయ్యారు?
నా రాజకీయం జీవితం బిఆర్‌ఎస్ పార్టీతోనే ప్రారంభించాను, నాపై నమ్మకంతో జహీరాబాద్ నుంచి రెండు సార్లు ప్రజలు గెలిపించారు. మారిన పరిస్థితుల దృష్టా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో బిజేపిలో చేరాను. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటంతో కొన్ని పనులు పూర్తి చేయలేకపోయాను. చేయాలనుకున్న అభివృద్ధి పనులను పూర్తిచేసి పార్లమెంట్ నిజకవర్గ ప్రజలకు సేవా చేయాలనే ఉద్దేశంతో బిజెపిలో చేరాను. నాపై నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు బిజెపి అధిష్ఠానానికి కృతజ్ఞతలు.

పది సంవత్సరాలలో మీరు ఏమీ చేయలేదనే విమర్శలకు మీరేమంటారు?
గత పది సంవత్సరాలుగా జహీరాబాద్ సెగ్మెంట్‌కు కేంద్రం నుంచి చాలా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టాను. 6 వేల కోట్లతో నేషనల్ హైవేను సుమారు 400 కిలో మీటర్లు, అండర్ ప్రాసెస్, రైల్వేట్రాక్, రైల్వే స్టేషన్లు, ఆధునీకరణకు నిధులను రాబట్టగలిగాను. మరికొన్ని పనులు ప్రాసెస్‌లో ఉన్నాయి. నేను చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నా నాపై విమర్శలు చేస్తే వారికి విజ్ఞతకే వదిలేస్తున్నా.

జహీరాబాద్‌లో బిజెపి వీక్‌గా ఉంది కదా.. మీరు ఎలా ముందుకు వెళుతారు?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితులు వేరు లోక్‌సభ ఎన్నికల వేళ పరిస్థిలు మారిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రజలు మరోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అలాగే పార్లమెంట్ సెగ్మెంట్‌లో నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జిలు పాతకొత్త అనే తేడా లేకుండా అందరు బిజెపి సైనికులుగా కలిసికట్టు గా పనిచేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నేతృత్వంలో బిజెపి శ్రేణులు ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు అశీర్వదిస్తున్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ పార్లమెంట్‌లో అడుగు పెడతా.

మళ్లీ గెలిస్తే మిమ్మల్ని మంత్రిగా చూడవచ్చా?
ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ భారీ మెజారిటీతో గెలుస్తాను. మళ్లీ దేశంలో మోడీ నాయకత్వంలో బిజెపి రాబోతుంది. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు అధిష్ఠానం నిర్ణయం మేరకు వారి ఆదేశాలను తూచతప్పకుండా పాటిస్తాను. ఒకవేళ అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తే జహీరాబాద్ పార్లమెంట్‌లోని ప్రజల భిక్షగా భావిస్తాను.
మిమ్మల్ని బిజినెస్ పాటిల్ అంటున్నారు..

దీనికి మా సమాధానం?
నేను రాజకీయాలకు రాకముందు వ్యాపార రంగంలో ఉన్నా. 2014లో రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యాను. ఎల్లప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాను.

కేకేవై రోడ్ల విస్తరణ పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోంది?
కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి వరకు రోడ్ల విస్తరణపై కొన్ని అనుమతులు అనివార్య కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి అనుమతులు వచ్చిన వెంటనే రోడ్ల విస్తరణ పనులు చేపడుతా. తొందరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

జహీరాబాద్ సెగ్మెంట్‌లో యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తారా?
జహీరాబాద్ సెగ్మెంట్ కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ల్లో ఉన్న వెనుకబడిన నియోజకవర్గం ఇక్కడ యూనివర్సీటీ అ వసరం ఉంటుంది. అందుకు నావంతు ప్రయత్నం చేస్తా. ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ విషయంలో పలుమార్లు లోక్‌సభలో ప్రస్తావించాను. యు వతకు ఉపయోగపడే యూనివర్సిటీలను తప్పకుండా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తాను.

ఇక్కడ ఎవరి మధ్య మీకు పోటీ ఉంటుందనుకుంటున్నారు?
ఇక్కడ ప్రధాన పార్టీల తరపున ముగ్గురం బరిలో ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థితో నే పోటీ ఉంటుందని భావిస్తున్నా. ప్రజల అండదండలతో భారీ మెజారిటీతో మళ్లీ ఎంపిగా గెలుస్తాను.

ఎంపిగా గెలిస్తే జహీరాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
వెనుకబడిన జహీరాబాద్ సెగ్మెంట్‌కు ఒక గుర్తింపు తెచ్చాను. అలాగే కేంద్రం నుంచి పలు అభివృద్ధి పను లు తీసుకువచ్చా. మరిన్నీ అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో బిజెపి పార్టీలో చేరాను. ఎంపిగా గెలుపొందిన అనంతరం నియోజకవర్గ ప్రజల అవసరాలను గర్తించి వారికి అనుగుణంగా కేంద్రం నుంచి అదనపు నిధులు తీసుకువస్తా.
జహిరాబాద్ ప్రజల సేవకే అంకితమవుతూ ఎప్పుడు తనవద్దకు వచ్చిన వారికి భరోసా కల్పిస్తాను. ఎన్నికల్లో బిజెపి కమలం గుర్తుకు ఓటువేసి నన్ను మరోసారి దీవించాలని మనసారా కోరుకుంటున్నాను.

కుంట అంజల్ రెడ్డి/ కామారెడ్డి ప్రతినిధి
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News