Thursday, May 2, 2024

సాగర్ జలాలు వస్తున్నాయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున సాగర్ జలాశయంలో ని లువ ఉన్న నీటినుంచి 14టిఎంసీలను తెలం గా ణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడుదల చేయా లని గురువారం నాడు విడుదల చేసిన ఆదేశా ల్లో స్పష్టం చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర వా టాగా 8.5టిఎంసీలు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వా టాగా 5.5టిఎంసీల నీటిని విడుదల చేయాలని పేర్కొంది. ఈ నెల 12 వ తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కృష్ణానదీయజమాన్య బోర్డు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని సమావేశంలోనిర్ణయించారు.

500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి వినియోగానికి అవకాశం ఉంది.అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదున్నర టీఎంసీలు కేటాయించారు. మిగిలిన నీరు హైదారాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగానికి తెలంగాణకు అనుమతి ఇచ్చారు. ఎండలు ముదిరి ఉష్ణోగ్రతలు పెరిగిపోత్నుందున నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే ఈ నీటిని వినియోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. హైదరాబాద్ జనాభాను పరిగణలోకి తీసుకొని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ణప్తిని పరిగణలోకి తీసుకుని నీటివాటాలను కేటాయించారు. దీంతో నాగార్జునసాగర్‌లో 500 అడుగులపై ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

508అడుగులకు తగ్గిన సాగర్
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 508.20అడుగులకు పడిపోయింది. రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 940క్యూసెక్కుల నీరు చేరుతుండగా , సాగర్ నుంచి 6770క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతోంది. ప్రాజెక్టులో 128టిఎంసీల మేరకు నీటి నిలువ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 809అడుగుల వద్ద జలాశయంలో నీటినిలువ 33.72టిఎంసీలు ఉంది. పులిచింతల ప్రాజెక్టులో నీటినిలువ 4.01టిఎంసీలు వున్నట్టు అధికారులు వెల్లడించారు. దిగవన ప్రకాశం బ్యారేజిలో 1.67క్యూసెక్కుల నీరు నిలువ వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News