Tuesday, September 9, 2025

సిక్కుల న్యాయమైన డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తాం

- Advertisement -
- Advertisement -

We will consider demands of Sikhs with positive attitude

సిక్కు ప్రముఖులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హామి

మన తెలంగాణ / హైదరాబాద్ : సిక్కుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సిక్కు ప్రముఖులకు హామినిచ్చారు. మాజీ ఐసిఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నాయకత్వంలో పలువురు సిక్కు ప్రముఖులు సచివాలయంలో సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ లోని సిక్కులలో చాలా మంది పేదరికంలో ఉన్నారని, ఇతర మైనారిటీలతో పాటు తమకు కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని ఈ సందర్భంగా ఆమె మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 44 గురుద్వారాలు ఉండగా వీటికి ఆదాయ వనరులు లేక నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. వీటి పూజారులు (గ్రంథి), రాగీస్ (కీర్తన్ సింగర్స్) జీవనోపాధి భారంగా ఉన్నందున వారికి ప్రతి నెలా రూ.7,500 గౌరవ వేతనం ఇవ్వాలని ఆమె మంత్రికి విజ్ఞప్తి చేశారు. కౌర్, ఇతర ప్రముఖులు చెప్పిన వాటిని మంత్రి కొప్పుల ఈశ్వర్ సావధానంగా విని, సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News