Monday, May 13, 2024

కాళోజీ అవార్డుకు చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్ ఎంపిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మాక అవార్డు 2022కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్‌ను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన వైతాళికులు, కవులు, సాహితీ వేత్తలు, మేథావుల సేవలను భవిష్యత్ తరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు హరగోపాల్‌ను ఎంపిక చేసిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు హరగోపాల్‌ను ఎంపిక చేస్తూ సాంస్కృతిక శాఖ అధికారులు జిఓ నెంబర్ 198లో (ఉత్తర్వులు) జారీ చేసింది. ఈ అవార్డు కింద రూ. లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయల (1,01,116/-) నగదు, కాళోజీ అవార్డును షీల్డ్‌ను అందిస్తారు.

Ramoju Haragopal Selected to Kaloji Narayana Rao Award 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News