Friday, May 3, 2024

ప్రభుత్వ ఆస్పత్రులను అర్ధరాత్రి తనిఖీ చేసిన తేజస్వి

- Advertisement -
- Advertisement -

Tejashwi inspected government hospitals at midnight

పాట్నా: బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మంగళవారం అర్ధరాత్రి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజకీయ కార్యకలాపాల ఉండగా ఢిల్లీలో ఉండగా మంగళవారం తేజస్వి పరిపాలనా బాధ్యతలలో బిజీబిజీగా గడిపారు. ఆరోగ్యం, రోడ్డు నిర్మాణం, పట్టణాభివృద్ధి తదితర శాఖలను చూసుకుంటున్న తేజస్వి అర్ధరాత్రి రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన పిఎంసిహెచ్‌తోపాటు గార్డినెర్ రోడ్డు, గార్దాని బాగ్‌లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ట్రాక్ సూట్, తలపై క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి వచ్చిన 33 ఏళ్ల ఉపముఖ్యమంత్రిని ఆసుపత్రి సిబ్బంది గుర్తుపట్టలేకపోయారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా లేకపోవడం, మందుల కొరత ఉండడం, నైట్ డ్యూటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లోపాలన్నిటినీ ఆరోగ్య శాఖ సమావేశంలో చర్చిస్తానని ఆయన ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News