Friday, May 17, 2024

చందమామ ఆవలిభాగం నుంచి నమూనాల సేకరణ

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే 6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగిస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. లాంగ్ మార్చ్5 వై 8 రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతామని పేర్కొంది. హైనాన్ ప్రావిన్స్ లోని వెంచాంగ్ స్పేస్ లాంచ్ కేంద్రం ఇందుకు వేదిక అవుతుంది. ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాంగే 6 లో ఆర్బిటర్, ల్యాండర్ ఉంటాయి. ల్యాండర్‌లో ఐరోపా దేశాలకు చెందిన పరికరాలు ఉంటాయి. ఆర్బిటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన పేలోడ్ కూడా ఉంది. 2030 నాటికి చందమామ పైకి మానవ సహిత యాత్ర నిర్వహించాలని చైనా లక్షంగా పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News