Sunday, May 19, 2024

ఇండో-పసిఫిక్ ప్రాంతంలోకి రెండు జర్మనీ యుద్ధ నౌకలు

- Advertisement -
- Advertisement -

దక్షిణ చైనా సముద్రంలో చైనా, తైవాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జర్మనీ రెండు యుద్ధ నౌకలను ఇండో-పసిఫిక్ ప్రాంతంలోకి పంపింది. ఈ ప్రాంతంలో తన సైన్యాన్ని బలపరుచుకోడానికి వీటిని పంపింది. ఆ ఉద్రిక్తతలు నావికా  స్వేచ్ఛ , వాణిజ్య మార్గాలలో స్వేచ్ఛా మార్గంపై ఒత్తిడి తెచ్చాయని రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ విల్హెల్మ్‌షావెన్‌లోని ఉత్తర జర్మన్ నేవీ బేస్ వద్ద తెలిపారు. ఐరోపా విదేశీ వాణిజ్యంలో 40% దక్షిణ చైనా సముద్రం గుండానే జరుగుతుంది.

బీజింగ్ వాదనలకు ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటికీ, బీజింగ్ దాదాపు మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని తమదేనని పేర్కొంది. తైవాన్‌కు బలమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యబద్ధంగా పాలించబడుతున్న తైవాన్‌ను చైనా తన సొంత భూభాగంగా పేర్కొంది.

2021లో ఒక జర్మన్ యుద్ధనౌక దాదాపు 20 సంవత్సరాలలో మొదటిసారి దక్షిణ చైనా సముద్రంలోకి ప్రయాణించింది. చైనా హెచ్చరికల మధ్య… ఈ ప్రాంతంలో సైనిక ఉనికిని విస్తరించడంలో ఇతర పాశ్చాత్య దేశాలతో జర్మనీ చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News