Saturday, July 27, 2024

మరణించిన పారిశుద్ధ కార్మికుల బంధువులకు రూ. 30 లక్షలు

- Advertisement -
- Advertisement -

పరిహారానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : 2017లో స్వయంగా పారిశుద్ధ పని చేస్తుండగా మరణించిన ముగ్గురు కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 30 లక్షలు వంతున పరిహారం చెల్లించాలని ఢిల్లీ నగర అధికారులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 2023లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుకు అనుగుణంగా అధిక ఎక్స్‌గ్రేషియా కోరుతూ వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. స్వయంగా పారిశుద్ధ పని చేస్తూ ప్రాణాలు కోల్పోయినవారిపై ఆధారపడినవారికి చెల్లించే పరిహారాన్ని ప్రస్తుత రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు సుప్రీం కోర్టు ఆ ఉత్తర్వులో పెంచింది.

2017 ఆగస్టులో లజపత్ నగర్‌లో ఒక డ్రెయిన్‌ను శుభ్రం చేస్తూండగా ముగ్గురు పారిశుద్ధ కార్మికులు మరణించారని కుటుంబ సభ్యులు పిటిషన్‌లో తెలిపారు. మృతులను ఢిల్లీ జల్ బోర్టు సబ్ కాంట్రాక్టర్ నియోగించినట్లు వారు తెలిపారు. ఆ కార్మికుల మరణం తరువాత కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల పరిహారం మంజూరు చేశారని పిటిషనర్లు తెలియజేశారు. అయితే, పరిహారం మొత్తాన్ని రూ. 30 లక్షలకు పెంచాలని వారు ప్రార్థించారు.

సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను కార్పొరేషన్లు, రైల్వేలు, కంటోన్‌మెంట్లు, ఢిల్లీ కార్పొరేషన్ అజమాయిషీలోని ఏజెన్సీలకు వర్తింపచేసినట్లు గ్రహించవచ్చు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబంతో సహా మురుగునీటి పారుదల కార్మికుల విషయంలో పునరావాస చర్యలు తీసుకునేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడమైంది. మృత కార్మికుల కుటుంబ సభ్యులకు ఇచ్చిన రూ. 10 లక్షల పరిహారాన్ని రూ. 30 లక్షలకు పెంచాలని ప్రత్యేకంగా ఆదేశించడమైంది’ అని జస్టిస్ సచిన్ దత్తా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News