Saturday, July 27, 2024

యుపిలో బిజెపి గెలిచేది ఒక్క సీటే: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

యుపిలో బిజెపి గెలిచేది ఒక్క సీటే
అదే వారణాసి
ప్రయాగ్‌రాజ్ సభలో రాహుల్ గాంధీ

ప్రయాగ్‌రాజ్ : బిజెపి ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క సీటు మాత్రమే గెలవబోతున్నదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం జోస్యం చెప్పారు. ఇండియా కూటమి అభ్యర్తి ఉజ్జవల్ రమణ్ సింగ్‌కు మద్దతుగా ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో కలసి సంయుక్త ఎన్నికల సభలో రాహుల్ ప్రసంగిస్తూ, ‘(ప్రధాని) నరేంద్ర మోడీ బిజెపి సీటు క్యోటో (వారణాసి) మాత్రమే గెలుస్తున్నారని మీరు విన్నారా’ అని అడిగారు. వారణాసిని జపాన్‌లోని రమణీయ పట్టణం క్యోటోగా మారుస్తానని ప్రధాని నరేంద్ర మోడీ ఇంతకుముందు ప్రకటించారు.

‘రాజ్యాంగం పరిరక్షణ కోసమే పోరాటం. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దానిపై దాడి చేస్తున్నాయి. ఏ శక్తీ రాజ్యాంగాన్ని చించి, పారేయజాలదని వాటికి చెప్పదలిచాను’ అని రాహుల్ రాజ్యాంగం ప్రతి ఒకదానిని చూపుతూ ప్రకటించారు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను రాహుల్ పునరుద్ఘాటించారు. పార్టీ అభ్యర్థికి వోటు వేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రాహుల్‌కు ముందు అఖిలేశ్ ప్రసంగిస్తూ, బిజెపి ప్రజల జీవితాల వెంట, రాజ్యాంగం వెంట పడిందని ఆరోపించారు. ‘కొవిడ్ వ్యాక్సిన్‌తో మన ప్రాణాలకు బిజెపి ముప్పు కలిగించింది. ఇప్పుడు ఆ పార్టీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటోంది’ అని అఖిలేశ్ అన్నారు. ఉజ్జవల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టిక్కెట్‌పై అలహాబాద్ లోక్‌సభ సీటుకు పోటీ చేస్తున్నారు. ఆయన బిజెపి అభ్యర్థి నీరజ్ త్రిపాఠిపై పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఆరవ దశలో ఈ నెల 25న అలహాబాద్‌లో పోలింగ్ జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News