Saturday, July 27, 2024

రుణమాఫీపై కదిలిన యంత్రాంగం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో పంట రుణాల మాఫీ పై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లా స్థాయిల్లో బ్యాంకుల వారీగా రైతుల పంట రుణాల వివరాల సేకరణపై క సరత్తు లు ప్రారంభించింది. ఎప్పటిలోగా రుణా లు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో ఇప్పటికే వివరాలు ప్రకటించారు. ప్ర క్రియకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలను ప్రభు త్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కు టుంబంలో ఒ క రైతుకు ప రిమితం చేస్తారా లేదా ఎంత మంది తీసుకుం టే అంత మందికి మాఫీవర్తింపజేస్తారా అనేదానిపై స్ప ష్టత రావాల్సివుంది. 2019 ఏప్రిల్ 1, నుంచి2023 డిసెంబరు10 మధ్య రూ. 2 లక్షలలో పు రు ణాలు తీసుకున్న, రె న్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వ ర్తిస్తుందని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం అర్హులైన రైతులకు సంబంధించిన జాబి తా పంపాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహ

కారసం ఘాలు, ఆంధ్రప్రదేశ్ గ్రా మీణ వి కాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లను రాష్ట్ర అధికారులు ఆ దేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంకు లే పెద్ద ఎత్తున పంట రుణాలను మంజూ రు చేశాయి. డీసీసీ బీ ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉం ది. ఆయా బ్యాంకుల్లో 1.75 ల క్షల మంది పంట రుణాలు తీసుకున్నారు. వీ రిలో 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతు లే. సుమారు రూ.882.12 కోట్ల వ రకు రుణమాఫీ వర్తించే అవకాశం ఉం దని సమాచారం. మ రో బ్యాంకు ఏపీజీవీబీ పరిధిలో ఖమ్మం జిల్లా లో 83 వేల మంది రైతులు రూ. 945.76 కోట్లు, భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42వేల మంది రూ.448.35 కోట్ల రుణాలు పొందారు. వీ టితో పాటు జాబితా తయారు చే యాలని ఒకట్రెండు రోజుల్లో ఇ తర వా ణిజ్య బ్యాంకులకు కూడా ఆదేశాలు రానున్నట్లు సమాచారం.

మిగిలిన జిల్లాల్లో కూడా అర్హత గల రైతుల వివరాల సే కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభు త్వం రైతులకు నాలుగేళ్లలో దశల వారీ గా రుణమాఫీ వర్తింపజేసింది. రూ.25 వేలు, రూ.50 వేలు, ఆ తర్వాత రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసింది. రుణాలను సకాలంలో రెన్యువల్ చేయించని వారికి మాఫీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ తేదీల్లోనూ వీ రికి చోటుదక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి రైతులు సహకా ర సంఘాల్లో ఎక్కువగా ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్న వారు, పిల్లల పెళ్లిళ్ల అనంతరం హక్కు లు బదలాయించిన వారిలో ఎవరైనా కటాఫ్ తేదీల మధ్య రు ణాలు చెల్లిస్తే వారికి మాఫీ వర్తిస్తుంది. ఇతర అవసరాలకు అ ప్పులు చెల్లించి పట్టా పుస్తకాలు, డాక్యుమెంట్లు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై విధివిధానాల పై నిర్ణయం అనంతరం ఇటు వంటి వారిపట్ల మ రింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News