Thursday, May 23, 2024

100 కాదు..125రోజుల కార్యాచరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ మూడో పర్యాయ అధికారం హయాంలో తొలి వందరోజులకు కాదు తొలి 125 రోజులకు కార్యాచరణను (బ్లూప్రింట్)ను సిద్ధం చేసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కీలక దశలో ఆయన ఇండియా టుడే టీవీకి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఇం దులో పలు విషయాలను ప్రస్తావించారు. మూడోసారి మోడీ ఖాయం అని, ఈ దశలో ముందు తొ లి 100 రోజుల పనులను ముందుగా ఎంచుకున్నామని, అయితే దేశంలో తొలిసారిగా ఓటు హ క్కు పొందిన యువ ఓటర్ల ఉత్సాహాన్ని , వారు తమ పట్ల చూపుతున్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు 125 రోజుల బ్లూప్రింట్ సిద్ధం చేసుకుంటున్నామని వివరించారు. ఈ అదనపు పాతిక రోజుల కార్యక్రమాన్ని దేశ యువతకు అం కితం చేస్తామన్నారు. వారి ప్రయోజనాలకు పలు పథకాలు ఉంటాయన్నారు. వందరోజుల కార్యాచరణ ఇప్పటికే సిద్ధం అయింది,

ఇప్పుడు దీనికి అదనంగా పాతిక రోజుల కార్యాచరణ జత అవుతుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ తమ లక్షం అని, ఇందులో యువత పాత్ర ఆద్యంతం కీలకం కావాలనేదే ఉద్ధేశం అని, వారి ప్రాధాన్యతలను పొందుపర్చడం జరుగుతుంది, వారి ఆలోచనలకు విలువనివ్వడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే తాము 20 లక్షల మంది నుంచి అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని, తొలి 100 రోజుల పాలన లక్షాల ఖరారు క్రమాన్ని వీటి ప్రాతిపదికన రూపొందించారని తెలిపారు.
పరీక్షలలో పిల్లలను మనం నూటికి 95 శాతం మార్కులు తెచ్చుకోమ్మంటాం, 95 వస్తే 99 కి ఎందుకు ప్రయత్నించవు అంటాం, నూటికి నూరు రావడం ఎవరికి అయినా కష్టమే. అయితే దీనికి కూడా విద్యార్థి యత్నించాల్సిందే తప్పేమీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమికి 400 స్థానాలు వస్తాయని తాను పదేపదే చెప్పడాన్ని ఆయన సమర్థించుకున్నారు. మన పనితీరు, మన పట్ల ఉండే నమ్మకం మనను అత్యున్నత స్థానానికి పురికొల్పుతుంది. దీనిని తాము ఈ లోక్‌సభ ఎన్నికలలో కూడా పాటిస్తున్నామని ప్రధాని మోడీ ప్రత్యేక ఇంటర్వూలో తెలిపారు.

రూ 1.25 లక్షల కోట్లు
ఇడి స్వాధీనసొమ్మును పేదలకు పంచుతాం
ఇటీవలికాలంలో పలు అవినీతి చర్యలు, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇడి స్వాధీనపర్చుకున్న కోట్లాది రూపాయల సొత్తును పేదలకు పంపిణి చేయడం జరుగుతుందని ప్రధాని తెలిపారు. ఈ విషయంలో అంతా సజావుగా సాగేందుకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నామని వివరించారు. అంతా చట్టబద్ధంగా జరిగేందుకు, అవినీతి సొమ్ము సక్రమదారికి మళ్లేందుకు పలు విధాలుగా ఆలోచనలు సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకూ ఇడి కేసులలో ప్రభుత్వం స్వాధీనపర్చుకున్నది 1.25 లక్షల కోట్ల రూపాయలని తెలిపారు. కొందరు తమ అధికారాన్ని, పలుకుబడిని వాడుకుని, దేశాన్ని దోచుకున్నారు. ఈ సొమ్ము ప్రజలవద్దకు చేర్చాల్సి ఉందన్నారు.
ఎన్నికల సంఘం సర్వస్వతంత్రం

కాంగ్రెస్ సంఘాన్ని కించపర్చింది
ఎన్నికల దశలో కాంగ్రెస్ ఇతర పార్టీలు పనిగట్టుకుని ఎన్నికల సంఘంపై విమర్శలకు దిగుతున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఇది దురుద్ధేశపూరితం. ఓ స్వతంత్య్ర వ్యవస్థగా బిజెపి ప్రభుత్వ హయాంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, లేనిపోని ఆరోపణలు తగవని చురకలు పెట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నికల సంఘం ఏకైక వ్యక్తి ఆధ్వర్యంలో ఉండేది. ఇప్పుడు ముగ్గురు ఎన్నికల అధికారులతో పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని, ఈ గ్యారంటీ తమ ప్రభుత్వం కల్పించిందని తెలియచేసుకున్నారు. గా కాంగ్రెస్ వ్యవహరించరాదన్నారు. ఖచ్చితంగా ఇసి ఇండిపెండెంట్‌గా ఉందన్నారు.
ఎన్నికలకు బిజెపి మంత్ర ఇదే

వ్యక్తి కాదు మా గుర్తే మా అభ్యర్థి
ఎన్నికల ప్రకటనలోనే విజయం కోసం వెంపర్లాడటం బిజెపి తత్వం కాదని, ఇతర పార్టీలు అభ్యర్థుల జాబితాలు వెల్లడించిన తరువాతనే ప్రజల్లోకి వెళ్లడం జరుగుతోందని, ఇందుకు బిజెపి విరుద్ధమని మోడీ తెలిపారు. ఏడాది కిందటి నుంచే పార్టీ ప్రజల వద్దకు వెళ్లడం ఆరంభించింది. ఇదే ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి బిజెపి పాటించిన మంత్రం అని మోడీ వివరించారు. నేతలకు తాను చెప్పింది ఒక్కటే ఎన్నికల వరకూ వేచి చూడకండి, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను కార్యకర్తల ద్వారా ప్రజల వద్దకు నేరుగా తీసుకువెళ్లేందుకు యత్నించండని చెప్పినట్లు వివరించారు. పార్టీ అభ్యర్థి ఎవరనేది కాదు, పార్టీ చిహ్నం అంటే కమలం పుష్పం మన అభ్యర్థి అనుకోండని చెపుతూ వచ్చానని, ఇదే ఇప్పుడు ఎన్నికలలో తమ పార్టీ సాగిస్తున్న జైత్రయాత్ర అయిందని తెలిపారు. తాము మూడో పర్యాయం కోసం ముందుకు సాగుతున్నామని, ఇందులో ఖచ్చితంగా విజయం దక్కించుకుంటామని, ఇక ఈ క్రమంలో తమపార్టీ మిత్రపక్షాల బలసంఖ్య కూడా నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ గెలుపు పట్ల ఇక్కడివారికే కాదు విదేశాల్లోని వారికి కూడా నమ్మకం ఉందన్నారు. తిరిగి ఇదే ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతోనే విదేశీ నేతల నుంచి కీలక సమావేశాలు, సదస్సులు, పర్యటనలకు తనకు ఆహ్వానాలు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రష్యా అధ్యక్షులు పుతిన్ సెప్టెంబర్‌లో పర్యటనకు పిలిచారు. ఇక జి 20 సదస్సుకు కూడా తమకు ఆహ్వానం అందిందని, తిరిగి వచ్చేది మునుపటి ప్రభుత్వమే అనే విశ్వాసం వారిలో ఉందని తెలిపారు.

తప్పుచేసినట్లు అయితే ఉరితీయండి
నిజాయితీ లేదని తేలితే ఉరితీయండి అని ప్రధాని స్పష్టం చేశారు, తనకు అదానీ అంబానిలతో లింక్ ఉందనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈ జవాబిచ్చారు. ఏది ఏమైనా ఈ దేశ సంపద సృష్టికర్తలను అంతా గౌరవించాల్సిందే. గతంలో టాటా బిర్లాల ప్రభుత్వం అని కాంగ్రెస్‌ను విమర్శించే వారని నెహ్రూ కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారని తెలిపారు. అదానీ లేదా అంబానీలనుంచి తనకు కానీ తన నుంచి వారికి కానీ మేలు జరిగిందనే వాదన సరికాదని, ఇది నిజమైతే ఏ శిక్షకైనా తాను సిద్ధం అన్నారు. తానెప్పుడూ ముస్లిం, హిందూ భేదభావాలను నాటుకునేలా మాట్లాడలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News