Saturday, June 1, 2024

అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

అన్ని రకాల ధాన్యానికి రూ.500బోనస్ ఇవ్వాలి
తెలంగాణ రైతుసంఘం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల వరిధాన్యానికి ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని తెలంగాణ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. కేవలం సన్న వడ్లకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నదని . దీంతో రైతాంగంలో గందరగోళ వాతావరణం ఏర్పడిందని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. రైతాంగం పండించే అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిందని, ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.

వడ్లు పండించే రైతులలో 80 శాతం దొడ్డు వడ్లు, 20 శాతం సన్న వడ్లును పండిస్తున్నారని , ఇందులో అత్యధికం సన్న చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. రైతాంగానికి నష్టం జరగకుండా వడ్ల పండించిన అందరికి ఒకే రకంగా బోనస్ చెల్లించాలన్నారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న యాసంగి పంటలకు కూడా వర్తింప చేయాలన్నారు. రైతాంగం గందరగోళానికి లోనూ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని తెలిపారు. వడ్లు పండించే రైతులందరికి ఒకే రకమైన బోనస్ చెల్లించని పక్షంలో రైతాంగాన్ని కూడగట్టి ఆందోళనా పోరాటాలు నిర్వహిస్తామని సుదర్శన్‌రావు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News