Monday, June 24, 2024

ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను జూన్ 6వ తేదీ వరకు 6 రోజులపాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కస్టడీకి అప్పగిస్తూ బెంగళూరు కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. హసన్‌లో మహిళలపై జరిగిన లైంగిక దాడి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాట చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 42వ అదరనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్(ఎసిఎంఎం) ఎదుట ప్రజ్వల్ రేవణ్ణను సిట్ హాజరుపరచగా ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత ఆయనను సిట్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.53 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు వేర్వేరు కేసులలో అరెస్టు నుంచి తప్పించుకుని జర్మనీలో తలదాచుకున్న ప్రజ్వల్ మునిచ్ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. నగరంలోని సిఐడి ప్రధాన కార్యాలయంలగల సిట్ కార్యాలయంలో ఉన్న తాత్కాలిక సెల్‌లో రాత్రంతా గడిపిన ప్రజ్వల్‌ను ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం శివాజీనగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హజరుపరిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News