Saturday, July 27, 2024

ఇసి కొరడా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:ఎపిలో జరుగుతున్నహిం సాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో ఇసి కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్‌పిలపై బ దిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్‌పిలను సస్పెండ్ చేసింది. అదే సమయంలో, తాడిపత్రి డిఎస్‌పి గంగయ్య, సిఐ మురళీకృష్ణలపై ఇసి సస్పెన్షన్ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమై న చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇ సి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి కేసుపై సిట్ వేసి రెండ్రోజుల్లో నివేదిక అందించాలని తన ఆదేశాల్లో వెల్లడించింది. హిం సాత్మక ఘటనలు జరిగిన చోట 25 కంపెనీల సాయుధ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు నిర్దేశించింది. లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూ డా బలగాలు కొనసాగించాలని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో వివరించింది. కాగా, గురువారం రాష్ట్ర సిఎస్, డిజిపిల నుంచి వివరణ అందుకున్న ఇసి. పోలింగ్ రో జు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం కనబర్చింది.పల్నాడు, తిరుపతి,

అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని ఇసి వెల్లడించింది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు సిఎస్, డిజిపి తెలిపారని స్పష్టం చేసింది. హింస ప్రజ్వరిల్లవడం వెనుక పోలీసుల కుట్ర ఉందని.. తేలడంతో పన్నెండు మంది ఇతర అధికారులపై ఇసి చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా అల్లరి మూకలకు సమాచారం ఇవ్వడం.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవడం.. నిందితుల్ని అరెస్టు చేయకపోవడం వంటివి చేశారని ఇసి గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం చెలరేగిన హింస కలకలం రేపుతోంది. వరుసగా మూడు రోజుల పాటు ఇవి జరిగాయి. పదమూడో తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రారంభమైన హింసాకాండ నిరాటంకంగా సాగింది. మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా బయటపడింది. కింది స్థాయి అధికారులే అధికార పార్టీ నేతలకు.. ప్రతిపక్ష నేతల కదలికలపై సమాచారం ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా ఇచ్చిన వారి వివరాలను కూడా గుర్తించారని.. ఆ వివరాలను ఇసికి ఇవ్వడంతోనే చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎపి డిజిపి, ఎపి సిఎస్ తీరుపైనా ఇసి అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సిఎస్ జవహర్ రెడ్డి విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉండటంతో ఆయనపై కూడా ఒకటి, రెండు రోజుల్లో వేటు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఎపి సిఎస్, డిజిపి హాజరు
కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఎపి సిఎస్ జవహర్‌రెడ్డి, డిజిపి హరీశ్ కుమార్ గుప్తా గురువారం హాజరయ్యారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని పలు చోట్ల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఇసికి వివరణ ఇచ్చారు. వీరితో పాటు ఇంటలిజెన్స్ చీఫ్ విశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగడంపై ఇసి తీవ్ర ఆగ్రహం కనబర్చింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగుల బెట్డడం వంటి ఘటనల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారని ఇసి నిలదీసింది. పరిస్థితిని అదుపుచేయకుండా ఏం చేస్తున్నారని ఇసి ప్రశ్నించింది. దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బుధవారం ఆదేశాలు జారీ చేయడంతో గురువారం సిఎస్, డిజిపి ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. దాదాపు అరగంట పాటు ఎన్నికల సంఘం అధికారులు వీరి నుంచి వివరణ తీసుకొని పంపించినట్లు తెలిసింది.

పల్నాడు, తాడిపత్రిల్లో దాడులు, చంద్రగిరిలో ఏకంగా టిడిపి అభ్యర్థిపైనే దాడి చేయడం, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వరుసగా జరిగిన ఘటనలపై ఇసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా అధికారులు పూర్తిగా నిర్లిప్తంగా వ్యవహరించడంపై మండిపడినట్లు తెలిసింది. ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆరా తీసి ఇసి అధికారులు ముందస్తుగా ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకన్నారు? దానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు కూడా తమ దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందుగానే హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు? అభ్యర్థిపైనే దాడి చేస్తుంటే ఎందుకు తగిన విధంగా స్పందించలేదనే అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం. కాగా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను ఇసికి సిఎస్, డిజిపి వివరించారు. కొన్ని వర్గాల మధ్య ఉన్న వ్యక్తిగత కక్ష్యల నేపథ్యంలోనే అల్లర్లు చెలరేగాయని సిఎస్, డిజిపి వెల్లడించారు అయితే వీరిపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే అంశంపై వివరాలు బయటకు రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News