Saturday, June 1, 2024

వికారాబాద్ లో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ లో అగ్ని ప్రమాదం ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున పట్టణంలో రామయ్యగూడ రోడ్డులో ఉన్న ఓ హార్డ్ వేర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి పక్క భవనానికి వ్యాపించాయి.

ఈ ప్రమాదంతో పరిసర ప్రాంతంలో భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కకున్న ఓ మహిళ, ఇద్దరు పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో హార్డ్ వేర్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News