Thursday, June 13, 2024

మాదాపూర్ లో కారు బీభత్సం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించి క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి పరిశీలించారు.ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి స్పీడ్ గా కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News