Saturday, July 27, 2024

19 నుంచి హైదరాబాద్‌లో ‘మట్కా’ యాక్షన్

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్- ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈనెల 19 నుంచి మట్కా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మాసీవ్ సెట్‌ను నిర్మిస్తున్నారు.

వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్న ఈ చిత్రంలో అతను మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా… కథ డిఫరెంట్ టైమ్స్‌లో సెట్ చేయబడింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News