Saturday, July 27, 2024

‘లవ్ మీ’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ “అరుణ్, నాగ ఈ చిత్రానికి బలం. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశాను. మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది.ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను”అని అన్నారు.

అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. “ఈ మూవీతో ఓ దర్శకుడి పుట్టుకను చూడబోతోన్నారు. సీతమ్మ, సతీదేవీ ఇలా అందరూ చనిపోయి దేవతలు అయ్యారు. దివ్యవతి చనిపోయి దెయ్యం ఎందుకు అయింది అంటూ అర్జున్ చేసే ప్రయాణమే ఈ చిత్రం. శివ పార్వతులు, సతీ దేవీ, గంగా దేవీల్లాంటి పాత్రలు ఈ చిత్రంలో ఉంటాయి. ఆర్జున్ అనే పాత్రలో ఆశిష్ కనిపిస్తాడు. అర్జున్ క్యారెక్టర్‌లో శివుడి రిఫరెన్సులు కనిపిస్తాయి. యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స్ కావాలి. మనిషిని ప్రేమించాలంటేనే ఎంతో ధైర్యం, గట్స్‌ఉండాలి.. అలాంటిది దెయ్యాన్ని ప్రేమించాలంటే ఇంకెంత గట్స్ ఉండాలి. ఈ పాత్రను ఆశిష్ ఎంతో ఇష్టంగా పోషించారు. గంగాదేవీ లాంటి పాత్రను వైష్ణవి పోషించారు” అని తెలిపారు.

ఆశిష్ మాట్లాడుతూ.. “కథ బాగుంటే ఆడియెన్స్ మూవీస్ చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకు కళ వస్తుంది. సింగిల్స్ స్క్రీన్స్ నిండిపోతాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి చైతన్య, సిమ్రన్ చౌదరి, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News