మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో టాటా ఏస్‌పై భారీ వృక్షం పడటంతో ఇద్దరు మృతి చెందగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఫాజుల్ నగర్ కల్వర్టు వద్ద కారు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు మరణించారు. కాగా, వరంగల్‌లో రోడ్డు డివైడర్‌ను బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించడంతో రోడ్లు రక్తసిక్తంగా మారాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు కుంటాల జలపాతం వద్దకు వెళ్తుండగా.. ఖానాపూర్ మండలం ఎగ్బాల్‌పూర్ సమీపంలోకి రాగానే వాహనంపై భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బుచ్చన్న35) అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా రవి (29) మృతి చెందాడు. కాగా, తీవ్రం గా గాయపడిన నిఖిల్ పరిస్థితి విషమం గా ఉంది. నిఖిల్‌ను తొలుత ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంత రం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ గ్రామ క ల్వర్టు వద్ద వరద ప్రవాహంలో కారు కొ ట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో గంగ(50), కిట్టు(2) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరిని స్థానికులు కాపాడి బైటకు తీశారు. మృతి చెందిన చిన్నారి తల్లి హైదరాబాద్‌లో ఉ ద్యోగం చేస్తుండగా, బాబును తల్లి వద్దకు తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతి కిట్టు ప్రమాదంలో బయటపడిన నరేష్ కుమారుడు. గుర్తించారు. డ్రైవర్ రిజ్వాన్ తొందరపాటు వల్ల ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. వీరంతా జగిత్యాల జిల్లా చెల్‌గల్ గ్రామానికి చెందిన వారు. కాగా, వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ కల్వర్టును ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశాయిపేట-పైడిపల్లి ప్రధాన రహదారి చోటు చేసుకుంది.
6 Killed in Separate Road Accidents in Telangana