Saturday, May 4, 2024

‘ముసురు’కుంది

- Advertisement -
- Advertisement -

ఉప్పొంగిన వాగులు, మత్తళ్లు దుంకిన చెరువులు పలుచోట్ల తెగిన రోడ్లు, నిలిచిన రాకపోకలు
వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం నార్లాపూర్ వాగులో చిక్కుకున్న వారిని ప్రొక్లెయినర్‌తో క్షేమంగా ఒడ్డుకు తరలింపు
గంభీరావుపేటలో పిడుగుపాటుకు 150 గొర్రెలు మృతి 
మంజీరా మధ్యలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు, 2వేల గొర్రెలు బలహీనపడిన అల్పపీడనం

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: గడచిన రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయ్యిం ది. పలు జిల్లాల్లో రహదారులపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. శని, ఆదివారాలలో ఉమ్మడి క రీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో కాలనీలు నీట మునిగి జనజీవనం స్థంభించింది. వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మిరప, వాణిజ్య పంటలైన పచ్చిమిర్చి, బీర, కంద, చిక్కుడు తదితర పంటలు వర్షపు నీటిలో నాని పూర్తిగా పాడయ్యాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో మునిగిపోయాయి. దాంతో జనం ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటితో వాగులు, చెరువులు ముత్తడులు పారుతున్నాయి. కాగా, మంచిర్యాలలో పిడుగుపాటుకు ఏకంగా 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కాగా, జిల్లాలో వాగులు ఉప్పొంగడంతో ఎక్కడికక్కడే రోడ్లు తెగిపోగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ధర్మరావుపేట, నగరం వాగులు పోటెత్తాయి. తిర్యాణి మండలం గంబీరావుపేటలో పిడుగుపాటుకు సుమారు 150 గొర్రెలు మృ తి చెందాయి. ముఖ్యంగా మంచిర్యాల, కొమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. కోనూర్ పం చాయతీ దారిలో ఉన్న బ్రిడ్జితోపాటు లోతట్టు వాగు ఉప్పొంగడంతో జనం భుజంలోతు నీటిలో ప్రయాణాలు కొనసాగించారు. చెన్నూర్‌లోని 63వ జాతీయ రహదారిపై పిచ్చపల్లి వద్ద వంతెన తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ మార్గంలో మహారాష్ట్రలోని సిరోంచవెళ్లే ప్రయాణికులు, కాళేశ్వరం వెళ్లే భక్తులు ప్రత్యామ్నాయ ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అదే విధంగా భీమారం మండలంలోని బూర్గుపల్లి నుంచి దాంపూర్ వెళ్లే ప్రధాన రహదారి జెర్రెగూడెం వద్ద రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూర్ మండలం చింతపల్లి బతుకమ్మ వాగు సమీపంలో రోడ్డు వరదలకు కొట్టుకుపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలో మంజీరా పాత బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతోంది. బోధన్‌లో పలు కాలనీలు నీట మునిగాయి. పట్టణంలోని వెంకతెప్వర కాలనీ, సరస్వతి నగర్ కాలనీ, రాకాసిపేటలోని కాలనీలు నీట మునిగాయి. సాలురా మంజీరా నది నిండుకుండలా పారుతుంది. బోధన్ రూరల్ మండలం పెగడపల్లి లంగ్డాపూర్ వాగుకు వరద ఉధృతి పెరిగింది. కాగా, డిచ్‌పల్లి చెరువు నిండుకుండలా మారి మత్తడిపై నుంచి నీళ్లు బయటకు వస్తూ పరవళ్ళు తొక్కుతున్నాయి. కామారెడ్డి జిల్లా రాజపేట మండలంలోని కొండాపూర్, గుండారం వాగులు ఉధృతంగా ప్రవహించడంతో కామారెడ్డి నుంచి మెదక్ వెళ్లే రహదారులను మూసివేశారు. కామారెడ్డి మండలంలోని లిం గాయిపల్లి వద్ద గల మెండి వాగు ప్రవాహం ఎక్కవ కావడంతో రాజంపేటకు రాకపోకలు నిలచిపోయాయి. అదేవిధంగా వెల్దండలోని బైరాపూర్ వాగు పొంగడంతో బైరాపూర్‌కు, చారకొండ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా లో దుందుభి వాగు పొంగడంతో నార్లాపూర్‌ముక్కిడి గుండం మధ్య రాకపోకలు స్థంభించాయి. కాగా, నార్లాపూర్ వాగులో చిక్కుకున్న వారిని ప్రొక్లెయిన్ సాయంతో వారిని బైటకు తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకోండపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఆమనగల్లులోని సురసముద్రం చెరువు, మేడిగడ్డ కాత్వవాగు, కడ్తాల గౌరమ్మ చెరువు అలుగు పారుతుంది. భారీ వర్షాలకు సిరిసిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడివారిని ప్రజాప్రతినిధులు, అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతంలోని ఇండ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిసిముద్దైంది. జనం బైటకురావాలంటేనే జంకుతున్నారు. ఏ క్షణంలో వర్షం వస్తుందోనన్నది అంతుచిక్కక జనం పనులను సైతం మానేసుకుని ఇళ్లల్లోనే కాలక్షేపం చేస్తున్నారు.

మంజీరా మధ్యలో చిక్కుకున్న గొర్రల కాపర్లు
మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలో మంజీరా ప్రవాహం మధ్యలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్చారం పరిసర ప్రాంతాలకు చెందిన 8 మంది గొర్రెల కాపరులతోపాటు, రెండువేల గొర్రెలు సైతం ప్రవాహం మధ్యలో చిక్కుకున్నాయి.మంజీరా అవలిగట్టున ఉన్న గుట్టల ప్రాంతానికి గొర్రెలను మేపేందుకు తీసుకుని వెళ్తుంటారు. ఇదేవిధంగా శనివారం సుమారు 2వేల గొర్రెలతో కాపరులు తోలుకుని వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం స్వగ్రామాలకు తిరిగి వచ్చేందుకు చూస్తుండగా.. మంజీరా వరద ప్రవాహం పెరగడంతో వారు అక్కడే ఉండిపోయారు. అయితే ఒక్కోసారి వీరు ముందు జాగ్రత్తగానే వంట దినుసులు సైతం తీసుకుని వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో మంజీరా ప్రవహించడంతో కాపరులు తమ కుటుంబ సభ్యులకు పరిస్థితిని ఫోన్‌లో వివరించడంతో వారు ఎస్‌ఐ సారా శ్రీనివాస్‌గౌడ్ పరిస్థితిని తెలిపారు. ప్రవాహం మధ్యలో ఉన్న కాపరులతో ఎస్‌ఐ ఫోన్లో మాట్లాడి, సమీపంలోని గెస్ట్‌హౌస్‌లో ఉండాలని వారికి సూచించారు. గొర్రెల కాపరుల వద్ద 15రోజులకు సరిపడా వంట సామగ్రి ఉన్నట్లు వారు తెలిపినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఎస్పీ రోహిణి ప్రయదర్శిని సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రవాహం మధ్యలో ఉన్నవారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, వరద ప్రవాహం తగ్గేవరకు, కాపరులు తీసుకోవలసిన జాగ్రతలను సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రవాహం తగ్గిన వెంటనే కాపరులతోపాటు గొర్రెలను బయటకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రోహిణి తెలిపారు.

Heavy Rains in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News