Saturday, July 27, 2024

నా సవాల్‌కు సిద్ధమా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్ర సిఎం రేవంత్‌రెడ్డి ఇ చ్చిన6గ్యారంటీలతోపాటు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి సిద్దిపేటకు వస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హ రీశ్‌రావు సవాల్ విసిరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తాను సంగారెడ్డి లో సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి స్వీకరించడం లేదన్నారు. రేవంత్ డొల్ల రాజకీయాలు మాని ఇచ్చిన హామీలను నెరవేరుస్తావా లేదా సూటిగా చెప్పాలన్నారు. తాను సైతం రాజీనామా పత్రంతో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వద్దకు వస్తానని అలాగే రేవంత్ రెడ్డి సైతం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా ప త్రంతో రావాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకపోతే రేవం త్ రెడ్డి కొడంగల్‌లో ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ హయాంలో జరగని అప్పులను సైతం చూపించి రాష్ట్రంలో పెట్టుబడులు రా కుండా చేశారన్నారు. కాంగ్రెస్ పిచ్చి  ప్రయాత్నాలతోనే రాష్ట్రం దివాలా తీసిందన్నారు. రియల్‌ఎస్టేట్ సైతం పూర్తి స్థాయిలో పడిపోయిందన్నారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దేవుళ్ల మీద ఒట్లు పెడుతూ నయా నాటకానికి తెర లేపారన్నారు. తనకు ఎంఎల్‌ఎ పదవి ముఖ్యం కాదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తానని బాండు రాసి ఇచ్చారని ఈ బాండు బౌన్స్ అయిపోయిందన్నారు. బిజెపి దేవుని పేరుతో ఓట్లు అడుగుతుంటే రేవంత్ రెడ్డి దేవునిపై ఓట్లతో ఓట్లు అడుగుతున్నాడని మండిపడ్డారు. బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య చీకటి ఒప్పందం నెలకొల్పుకున్నారన్నారు. రాష్ట్రంలో 16 ఎంపి సీట్లు ఉంటే చెరి 8 సీట్లను పంచుకుని ఒకరు పోటీ చేస్తున్న ప్రాంతాల్లో మరొక పార్టీ జాతీయ నాయకులు ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. ముమ్మాటికి ఈ రెండు పార్టీలు ఒక్కటే అని స్పష్టం చేశారు. బిజేపి మతం పేరిట రాజకీయలు చేస్తుంటే కాంగ్రెస్ రిజర్వేషన్‌లపై రాజకీయం చేస్తుందన్నారు. రేవంత్ రివర్స్ పాలన నడుస్తుందని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఏమో కానీ గతంలో ఇచ్చిన పథకాలు కూడా అందించడం లేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కోతలు వాతలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో ఆర్ ఆర్ టాక్స్ వసూల్ చేస్తున్నారని స్వయంగా మోడీయే చెప్పారని ఇది నిజమైతే ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ద్ధిపై రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు సిగ్గు చేటన్నారు. గత పది సంవత్సరాలు సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేని రేవంత్ ఓట్ల కోసం ఇక్కడ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి సిఎం కావడం సిద్దిపేట పుణ్యమేనన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోయడంతోపాటు కెసిఆర్ లాంటి ఉద్యమకారున్ని చేసింది సిద్దిపేటనేనన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సైతం సిద్దిపేటతోనే సాధ్యమైందన్నారు. కెసిఆర్ బస్సు యాత్ర సూపర్ హిట్ కావడంతోనే కాంగ్రెస్, బిజెపిలు నయా నాటకాలకు తెర లేపాయన్నారు. కొత్త జిల్లాలను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డిని ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు.

ప్రజలను సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తున్న బిజెపి, కాంగ్రెసోళ్లకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారన్నారు. సిద్దిపేట జిల్లాకు రావాల్సిన నిధులను ఆపేసిన రేవంత్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News