Friday, May 24, 2024

నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు -నమోదు

- Advertisement -
- Advertisement -

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ తన ఇంటిని బండ్ల గణేష్‌కు రెంట్‌కు ఇచ్చారు. నెలకు రూ. లక్ష అద్దె. అయితే కొంతకాలం బండ్ల గణేష్ ఇంటి రెంట్ చెల్లించడం లేదట. ఈ విషయమై ఆయనను నౌహిరా షేక్ నిలదీయగా బండ్ల గణేష్ రౌడీలతో తనను బెదించాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. అంతేకాదు ఇంట్లోకి కూడా రాబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. తన ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు ఫిబ్రవరి 15న తనను బెదిరించారని పేర్కొనారు.

అంతేకాదు రాజకీయ నాయకుల, గుండాల సహాయంతో తన ఇంటిని బండ్ల గణేస్ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆ ఇంటిలో బండ్ల గణేస్ అసాంఘిక కార్యక్రపాలకు పాల్పడుతున్నారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తనఇంటిని కబ్జా చేసేందుకు యత్ని స్తున్నారని చెప్పింది. ఈ వ్యవహారంపై ఆమె డిజిపికి ఫిర్యాదు చేయడంతో బండ్ల గణేశ్‌పై ఐపిసి 341, 506 సెక్షన్ల కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News