Wednesday, September 17, 2025

పాతబస్తీలో బాలికను ఎత్తుకెళ్లి… గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Gang rape on girl in Old City

 

హైదరాబాద్: బాలికను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతం డబీర్‌పూరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంచల్‌గూడ ప్రాంతంలో ఓ బాలికను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. మాయమాటలు చెప్పి నాంపల్లిలోని ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లారు. అక్కడి ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసి వదిలేసి పారిపోయారు. బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులతో కలిసి బాలిక డబీర్‌పూర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు నిందితులు బాలికకు తెలిసిన వారే గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News