Tuesday, May 7, 2024

33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR speech at Warangal TRS public meeting

వరంగల్: అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ‌ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ… కేంద్రమంత్రులు ఇక్కడ విమర్శిస్తూ.. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో భాగంగా కేంద్రమంత్రులు విమర్శిస్తున్నారు. గతంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఐదు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 17కు చేరిందన్నారు. రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్లు 6500కు పెరిగాయని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో వైద్య కాళాశాలలు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత విజయాలు సాధించిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News