Friday, May 3, 2024

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi joins Bharat Jodo Yatra

మాండ్య(కర్నాటక): కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం (అక్టోబర్ 6న) కర్నాటకలో కదులుతున్న భారత్ జోడో యాత్రలో కలుసుకున్నారు. ఈ ఏడాది మొదలులో కొవిడ్-19 గురైన ఆమె ప్రస్తుతం కోలుకోవడంతో యాత్రలో పాల్గొన్నారు. ఆమె అనారోగ్యం తర్వాత పాల్గొన్న తొలి ఈవెంట్ ఇది. ఆమె రాకతో పార్టీ కార్యకర్తలు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఇదివరలో ఆమె 2016లో వారణాసిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు గాయం కాగా సర్జరీ చేయించుకోవలసి వచ్చింది. కర్నాటకలోని మాండ్య జిల్లాలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు ఆమె వెంట కొన్ని కిలో మీటర్లు కలిసి నడిచారు. సోనియా గాంధీ ప్రధానంగా పాండవపుర, నాగమంగళ పట్టణాల మధ్య పాదయాత్ర నిర్వహించారు. సోనియా రాకతో పార్టీ కార్యకర్తల్లో ఓ ఉత్తేజం చోటుచేసుకుంది. విజయదశమి, దసరా పండుగల సందర్భంగా రెండు రోజులు ఆగిన భారత్ జోడో యాత్ర నేడు(గురువారం) తిరిగి మాండ్య నుంచి కొనసాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News