Tuesday, April 30, 2024

సోనియా గాంధీ నేతృత్వం లోని 2 ట్రస్టులకు ఎఫ్‌సీఆర్‌ఎ లైసెన్స్ రద్దు

- Advertisement -
- Advertisement -

FCRA license canceled for 2 trusts headed by Sonia Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జిపి), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జిసిటి)కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో నిబంధనలు ఉల్లంఘించిన కారణం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 2020 లో హోం శాఖ ఏర్పాటు చేసిన అంతర్‌మంత్రిత్వ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ట్రస్టులకు ఎఫ్‌సీఆర్‌ఎ లైసెన్సు తప్పనిసరి. ఈ ట్రస్టులకు సంబంధించిన ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ విరాళాల నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చలామణీ (పిఎంఎల్‌ఎ) వంటి నేరాలను మంత్రిత్వకమిటీ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం జులై 2020లో ఏర్పాటు చేసింది. ఆదాయపన్ను , పీఎంఎల్‌ఎ, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌పైనా దర్యాప్తు నిర్వహించనప్పటికీ, ప్రస్తుతానికైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దర్యాప్తు కమిటీలో హోం శాఖ , ఆర్థిక శాఖ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు చెందిన పలువురు అధికారులు ఉన్నారు. 2020 లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.

బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ఆ సమయంలో ఆర్‌జీఎఫ్‌పై పలు ఆరోపణలు చేశారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే కొన్ని అధ్యయనాలు చేపట్టడానికి 20052009 మధ్య ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందాయని ఆరోపించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్ ఛోక్సీ వంటి వారి నుంచి అప్పట్లో ప్రధానమంత్రి రిలీఫ్‌ఫండ్‌కు నిధులు అందాయని, వాటిని ఆర్‌జీఎఫ్‌కు మళ్లించారన్నారు. ఆర్‌జీఎఫ్ వెబ్‌సైట్ లోని 2005 06 వార్షిక నివేదిక ప్రకారం ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందించిన దేశాల జాబితాలో చైనా కూడా ఉంది. ఆర్‌జీఎఫ్‌ను 1991లో స్థాపించారు. ట్రస్టు వెబ్‌సైట్ ప్రకారం ఇది విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికత, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు మద్దతుగా పనిచేస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా , మోంటెక్‌సింగ్ ఆహ్లువాలియా, సుమన్ దూబే, అశోక్ గంగూలీ ఆర్‌జిఎఫ్‌కు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆర్‌సీటీని 2002 లో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేయడమే లక్షంగా దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ ట్రస్టు యూపీ, హర్యానా లో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలు ఢిల్లీ లోని పార్లమెంటు కాంప్లెక్సుకు సమీపంలో ఉన్న జవహర్ భవన్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News