Monday, September 15, 2025

పదేండ్లు దాటితే ఆధార్ ఆప్‌డేట్ తప్పనిసరి చేయాలి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదరాబాద్: పదేండ్లు దాటితే ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి అని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆధార్ అప్‌డేట్‌తో బ్యాంక్ ఖాతా, సిమ్‌కార్డు, ఉపకారవేతనాలు, ఆదాయపు పన్ను, బ్యాంకు రుణాలు, ఒకదేశం ఒకే రేషన్‌కార్డు కింద దేశంలో ఎక్కడైనా సరుకులు, స్కాలర్‌షిప్ వంటి వివిధ వాటికి అవకాశం లభిస్తోందన్నారు. ఆధార్ కేంద్రంలో ఎక్కడైనా అప్‌డేట్ చేసుకోవచ్చన్నారు. ఈకార్యక్రమంలో డిపిఆర్‌ఓ, శ్రీరాములు సూపరింటెండెంట్, ఈడిఎం రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News