Thursday, May 2, 2024

గవర్నర్ రాజకీయం చేస్తోంది: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గవర్నర్ రాజకీయం చేస్తోంది
బిజెపి రెండో ఆఫీస్ రాజ్ భవన్‌లో ఉంది
మోడీ చెప్పేవన్నీ అబద్ధాలే
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: గవర్నర్ రాజకీయం చేస్తుందని, బిజెపి మొదటి ఆఫిస్ నాంపల్లిలో ఉంటే రెండో ఆఫీస్ రాజ్ భవన్‌లో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో ఓడిపోయిన అక్కసుతోనే రామగుండంలో మోడీ మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ ఎస్పీడిసిఎల్ పరిధిలో 69 అసిస్టెంట్ ఇంజనీర్‌లకు, 178 సబ్ ఇంజనీర్‌లకు మంత్రి జగదీష్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎండిలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డితో పాటు ఇతర డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేవంలో మాట్లాడుతూ మోడీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, నయా పైసా ఇవ్వకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు బిఆర్‌ఎస్‌తోనే దేశం అంత ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు.

24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం
ఉమ్మడి రాష్ట్రంలో 10 గంటల కొద్దీ కరెంట్ పోయేదని, కానీ ఇప్పుడు రెప్పపాటు కరెంట్ పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దేశంలో ఎక్కడైనా కరెంట్ పోనీ రాష్ట్రం ఉందంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ చూసిన చీకటి ఉన్నప్పటికీ మన రాష్ట్ర సరిహద్దుల్లో కరెంట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంలో పవర్ హాలీడేలు ఉండేవని ప్రస్తుతం కనీసం రెప్పపాటు కూడా పోవడం లేదని ఆయన తెలిపారు. ఇప్పటికూడా అనేక రాష్ట్రల్లో పవర్ హాలీడేలు, పవర కట్‌లు పెట్టారని, గుజరాత్ రాష్ట్రంలో కూడా కరెంట్ కోతలు ఇప్పటికీ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. తెలంగాణ సాధించిన విజయంలో విద్యుత్ ఇంజనీర్‌ల పాత్ర అంతాఇంతా కాదన్నారు. విద్యుత్ సరఫరాను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని, అయినప్పటికీ అన్ని తట్టుకొని ముందుకు వెళుతున్నామని ఇదంతా విద్యుత్ ఇంజనీర్ల విజయమని ఆయన పేర్కొన్నారు.

కష్టపడి పని చేసి సంస్థకు మంచిపేరు తీసుకురావాలి
సంస్థలో చేరబోతున్న ఉద్యోగులకు మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పని చేసి సంస్థకు మంచిపేరు తీసుకురావాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. సిఎండి ప్రభాకర్ రావు చరిత్ర తెలుసుకుంటే మీకు అందరికీ ఆయన వ్యక్తితం, పనితీరు అర్థం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. 53 సంవత్సరాలుగా సంస్థకు సేవలు అందిస్తున్న వ్యక్తి సిఎండి ప్రభాకర్ రావు అని ఆయన తెలిపారు. సంస్థ విషయంలో ప్రభాకర్ రావు మొండిగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.

Jagadish Reddy slams Governor Tamilisai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News