Friday, April 26, 2024

ఐసిసి జట్టులో కోహ్లీ, సూర్య..

- Advertisement -
- Advertisement -

ఐసిసి జట్టులో కోహ్లీ, సూర్య.. కెప్టెన్‌గా జోస్ బట్లర్
12వ ఆటగాడిగా ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యాకు చోటు

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) పురుషుల టి20 ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో మోస్ట్ వ్యాల్యుబుల్ జట్టును ప్రకటించింది. ఐసిసి పొట్టి ప్రపంచకప్ అత్యంత విలువైన జట్టులో ఇద్దరు భారతీయ ఆటగాళ్లకు చోటుదక్కింది. అదనపు ఆటగాడిగా హార్దిక్ పాండ్యాకు అవకాశం దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌లకు ఐసిసి తమజట్టులో స్థానం కల్పించింది. మొత్తం ఆరుదేశాలకు చెందిన ఆటగాళ్లతో ఐసిసి పురుషుల టి20 ప్రపంచకప్ 2022 మోస్ట్ వ్యాల్యుబుల్ జట్టును ప్రకటించింది. పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ పాకిస్థాన్, సెమీఫైనలిస్టులు భారత్, న్యూజిలాండ్ దేశాలతోపాటు జింబాబ్వే, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్, వికెట్‌కీపర్, ఓపెనింగ్ బ్యాటర్‌గా బట్లర్, మరో ఓపెనర్‌గా అలెక్స్‌హేల్స్‌తోపాటు సీమర్ సామ్‌కరన్ ఇంగ్లాండ్ జట్టునుంచి చోటు దక్కించుకున్నారు. వన్‌డౌన్ బ్యాటర్‌గా విరాట్‌కోహ్లీకి స్థానం కల్పించారు.

భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ప్రపంచకప్‌లో 296 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాపర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌పై 82పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ భారతజట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం బంగ్లాదేశ్‌పై 64పరుగులు, నెదర్లాండ్స్‌పై 62పరుగులు నాటౌట్, సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 50పరుగులు సాధించి శకంలో అగ్రశ్రేణి బ్యాటర్‌గా కోహ్లీ నిరూపించుకున్నాడు. కోహ్లీ తరువాత భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుతమైన షాట్లతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించాడు. పొట్టిప్రపంచకప్‌లో 239పరుగులు సాధించిన సూర్య మెగాటోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. సిడ్నిలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 51నాటౌట్, పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 68పరుగులు, మెల్‌బోర్న్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 61పరుగులు చేసి సూర్యకుమార్ అజేయంగా నిలిచాడు. కాగాప్రపంచకప్‌లో బ్యాట్‌తోపాటు బంతితో మెరిసిన భారత ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్య పరుగులు, 8వికెట్లు తనఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఐసిసి 12వ ఆటగాడిగా తమ జట్టులో చోటుకల్పించింది.

ఐసిసి టి20 ప్రపంచకప్ 2022: అత్యంత విలువైన జట్టు ఇదే
అలెక్స్‌హేల్స్(ఇంగ్లాండ్, 212పరుగులు), జోస్‌బట్లర్(కెప్టెన్/వికెట్‌కీపర్)(ఇంగ్లాండ్ 225పరుగులు), విరాట్‌కోహ్లీ(భారత్ 296 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (భారత్ 239 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్ 201పరుగులు), సికిందర్‌రాజా (జింబాబ్వే 219 పరుగులు), షాదాబ్‌ఖాన్(పాకిస్తాన్ 11వికెట్లు), సామ్‌కరన్(ఇంగ్లండ్ 13వికెట్లు), నోర్ట్జ్(దక్షిణాఫ్రికా 11వికెట్లు), మార్క్‌వుడ్(ఇంగ్లండ్ 9వికెట్లు), షహీన్‌షా అఫ్రిది(పాకిస్తాన్ 11వికెట్లు). 12వ ఆటగాడు హార్దిక్‌పాండ్యా (భారత్ 128 పరుగులు, 8వికెట్లు).

ICC Announces most valuable team of Men’s T20 World Cup

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News