Tuesday, May 21, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. రెండో విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్ కోట శక్తినగర్ లో లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా ఓటు వేశారు. బిజెపి కోట లోక్ సభ అభ్యర్థిగా ఓం బిర్లా బరిలో ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆయన భార్య సుధామూర్తి బెంగళూరులో ఓటు వేశారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కేరళ అలప్పుజలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఓటు వేశారు. జోధ్ పుర్ లో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ ఓటు వేయగా, జోధ్ పుర్ లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూరులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓటు వేశారు. తిరువనంతపురంలో బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, ఇస్రో ఛైర్మెన్ ఎస్. సోమనాథ్ ఓటు వేశారు. కర్నాటక రామనగర్ లో మాజీ సిఎం, జెడీఎస్ అభ్యర్థి హెచ్ డి కుమారస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్నాటక ఉడిపిలో ఓటు వేసిన కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టి ఓటువేశారు.  2024 ఫేజ్ 2 లోక్ సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 40శాతం ఓటింగ్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News