Sunday, May 5, 2024

రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 17 లోక్‌పభ స్థానాలకు గాను దాదాపు 700 మంది వరకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడగా, అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 17 స్థానాలకు సంబంధించి బుధవారం వరకు 603 మంది పోటీలో నిలవగా, చివరి రోజైన నేడు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియడంతో నేటి నుంచి పరిశీలన జరగనుంది.

ఈనెల 29వ తేదీన ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. మరోవైపు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. 17 ఎంపి స్థానాలు, ఒక ఎమ్మెల్యే స్థానానికి మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగనున్న కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బిఆర్‌ఎస్ తరఫున దివంగత మాజీ ఎమ్మెల్యే నందిత సోదరి నివేదిక బరిలో నిలవగా, కాంగ్రెస్ తరఫు న నారాయణ్ శ్రీ గణేశ్, బీజేపీ తరఫున వంశా తిలక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News