Saturday, May 18, 2024

రికార్డులు సృష్టించిన కోహ్లీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు వరస విజయాలతో ఆర్‌సిబి దూసుకపోతుంది. ఇప్పటికే ఐపిఎల్‌లో 11 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచిన కూడా నాకౌట్‌కు చేరుకోవడం కష్టంగా ఉంది. గుజరాత్‌పై ఆర్‌సిబి నాలుగు వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సృష్టించాడు. టి20 క్రికెట్‌లో 12500 పరుగులు మైలు రాయిని అందుకున్న మొదటి భారతీయ క్రికెటర్ రికార్డు నెలకొల్పాడు. గుజరాత్ జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 27 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

దీంతో 387 మ్యాచ్‌ల్లో 12,536 పరుగులు చేశాడు. టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ 15,562 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 11,482 పరుగులతో విరాట్ తరువాత ఉన్నాడు. ఐపిఎల్‌లో విరాట్ కోహ్లీ 7805 పరుగులతో తొలి స్థానంలో ఉండగా వరసగా శిఖర్ ధావన్(6769), డేవిర్ వార్నర్(6564), రోహిత్ శర్మ(6537), సురేశ్ రైనా(5528), ఎంఎస్ ధోనీ(5192) పరుగులతో తరువాత స్థానాలలో ఉన్నారు. ఐపిఎల్ 2024లో విరాట్ కోహ్లీ 542 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఈ ఐపిఎల్ లో విరాట్ ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపిఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎనిమిది సెంచరీలతో తొలిస్థానంలో ఉండగా వరసగా జోస్ బట్లర్(7), క్రిష్ గేల్(6) సెంచరీలతో తరువాత స్థానాలలో ఉన్నారు. హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్ 62 హాఫ్ సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 54 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News