Wednesday, May 22, 2024

నేను రుణమాఫీ చేస్తా… రాజీనామా లేఖను రెడీగా పెట్టుకో హరీష్: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ చేయకుంటే మా ప్రభుత్వం ఎందుకు అని ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని, రుణమాఫీ చేసి తీరుతానని, హరీష్ రావు రాజీనామా తన లేఖను రెడీగా ఉంచుకోవాలని ప్రతిసవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఇప్పుడే ఎందుకు అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లాడని సిఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. హరీష్ రావు రాజకీయ డ్రామాలకు ఆడటానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. రాజీనామాలో లేఖలో సీసా పద్యం రాసుకొచ్చారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బిజెపి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News