Saturday, July 27, 2024

Parliament Elections: రెండో దశ పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 88 పార్లమెంట్ స్థానాలలో రెండో దశ పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. రెండో దశ పోలింగ్ 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలకు 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 16 లక్షల మంది సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద పని చేస్తున్నారు. 88 లోక్ సభ స్థానాలలో 1202 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

కేరళలోని మొత్తం 20 సీట్లు, కర్నాటకలోని  14 సీట్లు, రాజస్థాన్‌లో 13 సీట్లు, మహారాష్ట్రలో 8 సీట్లు, ఉత్తర్ ప్రదేశ్ లో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లోన 7 సీట్లు, అద్సం, బీహార్,లోని చెరో 5 సీట్లు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోని చెరో 3 సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కశ్మీరులోని ఒక్కో సీటుకు శుక్రవారం పోలింగ్ జరుగుతంది.

రెండో దశ పోలింగ్ లో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, నటుడు అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బిజెపి సిట్టింగ్ ఎంపీలు హేమ మాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ ఆయా నియోజకవర్గాలలో హ్యాట్రిక్ విజయం కోసం తలపడుతున్నారు.

Second Phase polling started in Parliament elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News