Wednesday, May 22, 2024

రాజీనామా లేఖతో హరీశ్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మెదక్ నుంచి రేవంత్‌రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. శుక్రవారం ఉద యం 10 గంటలకు అ సెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి నా రాజీనామా లేఖతో వ స్తా.. మీరు రండి అని హరీశ్‌రావు మరోసారి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో హరీశ్‌రావు పా ల్గొని ప్రసంగించారు. ఆగస్టు 15 లోపు రుణమా ఫీ చేస్తానన్నది నిజమైతే,

బాండ్ పేపర్ మీద రాసిచ్చిన గ్యారంటీల అమలు చేసే మాట నిజమైతే, గన్‌పార్క్ వద్దకు రా, రాజీనామా లేఖలను మేధావుల చేతిలో పెడుదాం. ఆగస్టు 15లోగా రుణమా ఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను తీసుకెళ్లి స్పీకర్‌కు ఇస్తారు. ఒకవేళ అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ గవర్నర్‌కు ఇస్తారు. నువ్వుదానికి సిద్ధమా? అని అడుగుతున్నా, దమ్ముంటే రా, మాట మీద నిలబడే వ్యక్తివి అయితే రా.. నువ్వు రాకపోతే తోక ముడిచినట్టేనని హరీశ్‌రావు వెల్లడించారు. సవాల్ విసిరినట్టుగానే రాజీనామా లేఖతో నేడు అమరుల స్థూపం వద్దకు వెళ్లేందుకు హరీశ్ సిద్ధం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News