Monday, August 25, 2025

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

 

జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మామిడి పల్లి శివారులో గురువారం జరిగింది. సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… మామిడిపల్లి శివారులోని జాతీయ రహదారిపై ఎదో గుర్తుతెలియని వాహనం డ్రైవర్ ఢీకొట్టి పోవడంతో మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని శవాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో ఉంచమన్నారు. ఎవరైన ఈ మహిళను గుర్తిస్తే సంగారెడ్డి రూరల్ పోలీసులకు తెలపాలని సూచించారు. లేదా 8712646746,7901148908 నెంబర్ కు సంప్రదించాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News