Tuesday, April 30, 2024

వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ‘నారప్ప’

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు.

‘నారప్ప’ థియేటర్స్ విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News