Friday, April 26, 2024

మహాకాల్ మందిరంలోకి ఇకపై ఫోన్‌లకు అనుమతి లేదు

- Advertisement -
- Advertisement -

ఉజ్జయిన్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఉజ్జయిన్ నగరంలోని ప్రసిద్ధ మహాకాలేశ్వర్ మందిరంలో భద్రతా కారణాలరీత్యా డిసెంబర్ 20 నుంచి మొబైల్ ఫోన్‌లను అనుమతించరు. జిల్లా సీనియర్ అధికారి ఈ విషయాన్ని చెప్పారు. జిల్లా కలెక్టర్ అశీష్ సింగ్ నేతృత్వంలో టెంపుల్ మేనేజ్‌మెంట్ కమిటీ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. మందిరంలోకి భక్తులు ఎవరూ ఫోన్లను తీసుకెళ్ల రాదన్న సమాచారాన్ని తెలియజేయాలని హోటళ్లు, లాడ్జింగ్‌లో దిగే భక్తులకు తెలుపాలని కలెక్టర్లు ఆదేశించారు.

దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మహాబలేశ్వర మందిరం ఒకటి. ఈ పుణ్య క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మందిరంలోకి ఫోన్లు తీసుకుపోరాదనే విషయంతో పాటు అనేక ఇతర నిర్ణయాలను కూడా మందిర నిర్వహణ కమిటీ తీసుకుంది. పర్యాటకుల కోసం లగ్జరీ ఎయిర్‌కండిషన్డ్ బస్సు, ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడుపుతామని కలెక్టరు ఈ సందర్భంగా తెలియజేశారు. అన్ని టూరిస్టు ప్రదేశాలు, మందిరాలను కవర్ చేస్తూ ఈ బస్సులు నడుస్తాయి. అందుకు పర్యాటకులు ఒకే టిక్కెట్టు కొనాల్సి ఉంటుంది. భక్తులకు ఉపయోగంగా ఉండేందుకు 50 సమాంతర ఫోన్ లైన్ల కాల్ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News