Sunday, April 28, 2024

మహాకాళి ఆలయానికి వెళ్తా.. అజ్మీర్ దర్గాను సందర్శిస్తా

- Advertisement -
- Advertisement -

ఇండోర్: బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లు ఆమెను కించపర్చడంతో ఘాటుగా ఆమె స్పందించింది. తన విశ్వాసం తన వ్యక్తిగతమని ఇతరులు ఏమనుకున్నా అన్ని విశ్వాసాలకు సంబంధించి ఆలయాలను సందర్శిస్తుంటానని ఆమె ఘాటుగా స్పందించారు. నటులు సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్ కుమార్తె సారా సోషల్ మీడియా వినియోగదారుల్లో ఒక వర్గం ఆమె తరచుగా వె
ళ్లడాన్ని తప్పు పట్టింది. 27 ఏళ్ల నటి రానున్న “జరా హట్‌కే జరా బచ్‌కే ” చిత్రానికి జాతీయ ప్రొమోషన్ క్యాంపైన్‌గా ఉంటున్నారు. అంతకు ముందు ఆమె లక్నో లోని శివాలయాన్ని సందర్శించే ఫోటోలను పోస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల ఆలయాలకు వెళ్లే ఆమె తరచుగా ఆయా ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తుంటారు.

రానున్న చిత్రానికి సంబంధించి ప్రొమోషన్ కార్యక్రమంలో భాగంగా పాత్రికేయులతో ఆమె మాట్లాడారు. నా పని నేను సీరియస్‌గా చేస్తాను. ప్రేక్షకులను వినోదపర్చడానికి ప్రయత్నిస్తాను. నా పని మీరు నచ్చకుంటే నేను బాధపడతాను కానీ నా వ్యక్తిగత మైన విశ్వాసం నా వ్యక్తిగతం. ఇందులో ఎవరి జోక్యం నేను సహించను. నేను అజ్మీర్ షరీఫ్‌ను సందర్శిస్తాను. అదే విధంగా బంగ్లా సాహిబ్‌కు వెళ్తాను. లేదా మహాకాళ్‌ను సందర్శిస్తాను. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు కూడా పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు” అని ఘాటుగా ఆమె స్పందించారు. సహ నటుడు వికీ కౌశల్ ట్రోల్స్‌కు చట్టబద్ధత ఇవ్వవద్దని మీడియాను అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News