Saturday, May 11, 2024

నేనూ రాజీనామాకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

రెండు లక్షల రుణ మాఫీతో సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నిక ల హామీలను ఆగస్టు 15లోగా అమలు చేస్తే నేను కూడా రాజీనామాకు సిద్దమని బిజెఎల్‌పి నేత మ హేశ్వర్ రెడ్డి సవాలు చేశారు. రాజీనామాలపై బి ఆర్‌ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని ఆ రోపించారు. 15 లోపు రైతులకు రూ. 2 లక్ష ల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుండగానే బిజెఎల్‌పి నేత మహేశ్వర్ రెడ్డి ఇందులో ఎంటర్ కావడం గమనార్హం. తాజాగా మహేశ్వర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం రాజకీయాలను వెడెక్కిస్తోంది.

హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేవలం రూ.2 లక్షల రుణమాఫీపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు, మరి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నేరవేరిస్తే ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసేందుకు నేను కూడా సిద్ధమని ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆగస్ట్ 15 లోపు అన్ని హామీలు నేరవేరిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. హరీష్ రావు సవాల్ స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామాకు రెడీగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. మరి మహేశ్వర్ రెడ్డి సవాల్‌కు ముఖ్యమంత్రి స్పందిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News