Saturday, May 11, 2024

ఒలంపిక్ ఛాంపియన్ ను ఓడించి బంగారం పతకం గెలిచిన భారత్

- Advertisement -
- Advertisement -

ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని గెలిచింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన టీమిండియా 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. దీంతో ఇండియాకు ఐదో బంగారు పతకం లభించింది.

ఇక, తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ మిక్స్‌డ్ డబుల్స్, మమిళా టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకాలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురేఖ-అభిషేక్ వర్మ జోడీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడీ 158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై విజయం సాధించింది.

పురుషుల టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్లో భారత జట్టు 238-231 తేడాతో నెదర్లాండ్స్ టీమ్‌ను ఓడించింది. మహిళల విభాగంలో కూడా భారత్‌కు స్వర్ణం లభించింది. సురేఖ, ఆదితి స్వామీ, పర్ణీత్ కౌర్‌లతో కూడిన జట్టు 236-225 తేడాతో ఇటలీ జట్టును ఓడించి పసిడి పతకం కూవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News