Wednesday, June 5, 2024

ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నం: ప్రియాంక

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తుందని ప్రియాంకగాంధీ అన్నారు. గడిచిన పదేళ్లలో మోదీ సర్కార్ బడా వ్యాపారుల కోసం మాత్రమే పనిచేసిందన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం ఏనాడు పనిచేయలేదని విమర్శించారు.

మోదీ తన మిత్రులకోసం రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని.. పేదలకు మాత్రం మోదీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. వాస్తవాలు తెలియకుండా మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఫైరయ్యారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ప్రియాంకగాంధీ అన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తుందని.. బిజెపి కుట్రను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రియాంక గాంధీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News