Saturday, May 18, 2024

అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతామని నాకు ముందే తెలుసు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని తనకు ముందే తెలుసునని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు సీటు మార్చాలని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కోరానని, బిఆర్ఎస్ 40 సీట్లు మాత్రమే గెలుస్తుందని కెసిఆర్ కు చెప్పానని, మరో 20 స్థానాలు మార్చాలని ముందు కెసిఆర్ కు చెప్పానని వివరించారు. తన స్థానం కూడా మార్చాలని కెసిఆర్ ను కోరానని కానీ అలా జరగలేదన్నారు. ప్రజల అభిప్రాయం తనకు తెలుసునని, 30వేల నుంచి 50 వేల మెజార్టీతో సుధీర్ కుమార్ గెలుస్తారని, రెండో స్థానం కోసం కాంగ్రెస్, బిజెపి పోటీపడుతోందని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News