Saturday, July 27, 2024

కాంగ్రెస్ బోనస్ బోగస్ అయ్యింది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: న్యూయార్క్, లండన్ లో విద్యుత్ పోయినా హైదరాబాద్ లో పోదు అనే పరిస్థితి ఉండేదని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలిపారు. విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని, కరెంటు లేక పంటలు ఎండిపోయాయని, ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. శనివారం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్ కు వెన్నెముక అని, బిఆర్ఎస్ హయాంలో తెలంగాణకు పరిశ్రమలు తరలి వచ్చాయని, కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు తరలిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయని కెసిఆర్ ఎద్దేవా చేశారు.

పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ అధిక స్థానాలు గెలుస్తుందని, రెండు ప్రభుత్వల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించామని, కాంగ్రెస్ చాలా పెద్ద తప్పులు చేసిందని, కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టి అక్కసు వెళ్లగక్కారని, కాంగ్రెస్ వైఫల్యమే ఆ పార్టీని కాటు వేయబోతుందని, కాంగ్రెస్ చేసిన నేరాలు క్షమించలేనివని  కెసిఆర్ మండిపడ్డారు.

వ్యవసాయం కోసం వేల కోట్లు ఖర్చు చేశామని, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను తాను కొనసాగించానని, బేషజాలకు పోయి బిఆర్ఎస్ చేసిన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపి వేసిందని సిఎం కెసిఆర్ దుయ్యబట్టారు. సిఎం రేవంత్ రెడ్డి ఏ ఊరు పోతే అక్కడి దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని, డిసెంబర్ 09 పోయి పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తా అంటున్నారని, ఏ సంవత్సరమో చెప్పలేదని చురకలంటించారు. చందానగర్ లో సబ్ స్టేషన్ పై దాడి చేసే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రం నుంచి కంపెనీలు భయపడి పారిపోతున్నాయని, కాంగ్రెస్ చెప్పిన బోనస్ సాయం, బోగస్ అయ్యిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News