Saturday, July 27, 2024

బిపిసిఎల్‌కు రూ. 26674 కోట్లు లాభం

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రముఖ సమీకృత ఇంధన సంస్థల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) ఇది వరకు ఎన్నడూ లేనంత అధికంగా రూ. 26673.50 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం రూ. 1870.10 కోట్లుగా ఉన్నది. రూ. 10 ప్రతి ఒక్క ప్రస్తుత ఈక్విటీ వాటాకు ఒక్కొక్కటి రూ. 10 ఈక్విటీ వాటా నిష్పత్తిలో బోనస్ వాటాలు జారీ చేయాలని బోర్డు సిఫార్సు చేసింది. 2023-24 సంవత్సరానికి ఈక్విటీ వాటాకు (ప్రీ బోనస్) రూ. 21 వంతున తుది డివిడెండ్‌ను కూడా బోర్డు సిఫార్సు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో నికర లాభం రూ. 4224.18 కోట్లుగా ఉన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ. 6477.74 కోట్లుగా ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News